జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను ప్రశంసించిన కేటీఆర్!
- నగర అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారన్న కేటీఆర్
- బొంతు రామ్మోహన్ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన మంత్రి
- ఆ పదవి చేపట్టడం తన అదృష్టంగా భావిస్తున్నా: రామ్మోహన్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మేయర్ ఎవరో కాసేపట్లో తేలిపోనుంది. నిన్న జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పదవీ కాలం ముగిసింది. దీంతో ఆయన చేసిన అభివృద్ధి పనులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ ఐదేళ్ల కాలంలో నగర అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారని కేటీఆర్ ప్రశంసించారు.
పదవి ముగిసిన సందర్భంగా బొంతు రామ్మోహన్ చేసిన ట్వీట్‌ను ఆయన రీట్వీట్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల నెరవేరిన అనంతరం జీహెచ్ఎంసీకి తొలి మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించడం పట్ల బొంతు రామ్మోహన్ హర్షం వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ చేశారు. ఆ పదవి చేపట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
తనకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు. తాను పదవిలో ఉన్న సమయంలో తనను ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నగర అభివృద్ధి కోసం ఐదేళ్ల కాలం పాటు తన శక్తి మేర కృషి చేశానని అన్నారు. మరిచిపోలేని జ్ఞాపకాలు ఎన్నో మిగిలాయని వివరించారు. తనపై ప్రేమ చూపించిన హైదరాబాదీలందరికీ థ్యాంక్స్ చెప్పారు.