ఐపీఎల్ వేలం ముందు సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు ఎదురుదెబ్బ!
- త్వరలో ఐపీఎల్ సీజన్ వేలం
- పేరు నమోదు చేసుకున్న అర్జున్
- తాజాగా విజయ్ హజారె వన్డే ట్రోఫీలో దక్కని చోటు
- 22 మంది ఆటగాళ్లలో అతడి పేరు లేని వైనం
త్వరలో ఐపీఎల్ సీజన్ వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొనడానికి కుర్రాళ్లు తహతహలాడుతుంటారు. తద్వారా తమ టాలెంట్‌ను నిరూపించుకుని టీమిండియాలో చోటు సంపాదించాలని అనుకుంటారు. ఈ కోరిక ఉన్న వారిలో టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఉన్నాడు.
అయితే, ఐపీఎల్ సీజన్ వేలానికి ముందు అతడికి చేదు అనుభవం ఎదురైంది. విజయ్ హజారె వన్డే ట్రోఫీలో పాల్గొనే ముంబయి సీనియర్ జట్టు జాబితాలో అతడి పేరు లేదు. కనీసం అందులో చోటు సంపాదించుకోలేకపోవడంతో ఐపీఎల్‌లో అతడు ప్రవేశించడం కష్టమే. ఈ నెల 20 నుంచి విజయ్ హజారె వన్డే ట్రోఫీ ప్రారంభం కానుంది. 22 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించారు.
ఆ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథిగా ఉంటాడు. ఇప్పటికే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం తొలిసారి ముంబై సీనియర్ జట్టుకు అర్జున్ టెండూల్కర్ ఎంపికయ్యాడు. అయితే, అందులో రాణించలేకపోయాడు. దీంతో విజయ్ హజారె ట్రోఫీ జట్టులో పాల్గొనే అవకాశం కోల్పోయాడు. ఇప్పటికే అర్జున్ ఈ నెల 18న జరగనున్న ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. అతడిపై ఎవ్వరూ ఆసక్తికనబర్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది.