వైఎస్ పాదయాత్ర ప్రారంభించిన ఆ రోజునే.. షర్మిల పార్టీ ప్రకటన!

  • ఏప్రిల్ 10న  పార్టీని ప్రకటించనున్న షర్మిల
  • ఆ రోజుతో వైఎస్ పాదయాత్రకు 18 ఏళ్లు
  • పార్టీ జెండా, విధివిధానాల రూపకల్పనలో తలమునకలు
వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఏప్రిల్ 10న పార్టీని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. షర్మిల తండ్రి వైఎస్ 2003లో అదే రోజున చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో షర్మిల కూడా ఏప్రిల్ 10న బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించనున్నట్టు సమాచారం.

ఒకవేళ ఆ రోజున పార్టీ కనుక ప్రకటించకుంటే, అదే రోజున చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏప్రిల్ పదో తేదీతో వైఎస్ పాదయాత్రకు 18 ఏళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైన కార్యక్రమానికి ఆ రోజున ముహూర్తం పెట్టుకున్నారని చెబుతున్నారు. ఈ లోపు పార్టీ జెండా, విధివిధానాలను ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.


More Telugu News