రెండో విడతలో 539 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయన్న నిమ్మగడ్డ.. పూర్తి వివరాలు!

  • 3,328 గ్రామ పంచాయతీల్లో రెండో దశ ఎన్నికలు
  • ఏకగ్రీవాలు పోగా 2,786 పంచాయతీల్లో పోలింగ్
  • ఈ నెల 13న రెండో విడత పోలింగ్
ఏపీలో తొలి దశ ఎన్నికల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. రెండో దశ పోలింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో దశ ఏకగ్రీవాలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ప్రకటించారు. అన్ని జిల్లాల్లో కలిపి 539 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని ఆయన తెలిపారు. మొత్తం 13 జిల్లాల్లో 167 మండల పరిధిలోని 3,328 గ్రామ పంచాయతీల్లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. ఏకగ్రీవాలు పోగా 2,786 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13న రెండో విడత పోలింగ్ జరగనుంది.

జిల్లాల వారీగా ఏకగ్రీవమైన పంచాయతీల సంఖ్య ఇదే:

గుంటూరు - 70
ప్రకాశం - 69
చిత్తూరు - 62
విజయనగరం - 60
కర్నూలు - 57
శ్రీకాకుళం - 41
కడప - 40
కృష్ణా - 36
నెల్లూరు - 35
విశాఖ - 22
తూర్పుగోదావరి - 17
పశ్చిమగోదావరి - 15
అనంతపురం - 15.


More Telugu News