ఏపీలో కరోనా కొత్త కేసులు 50 మాత్రమే!
- ఏపీలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు
- పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాని వైనం
- నెల్లూరు జిల్లాలో కరోనాతో ఒకరి మృతి
ఏపీలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 28,418 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా, కేవలం 50 మందికి మాత్రమే పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కో కేసు వంతున నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 13 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా నెల్లూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు వదిలారు. గత 24 గంటల్లో 121 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,88,605కి చేరుకుంది. మొత్తం 8,80,599 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 7,161 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 845 యాక్టివ్ కేసులు ఉన్నాయి.