విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వాస్తవాలను వెల్లడించిన కేంద్ర మంత్రి
- పోస్కో, విశాఖ ప్లాంట్ మధ్య 2019 అక్టోబర్ లో ఒప్పందం కుదిరింది
- ఆ తర్వాత జగన్ ను పోస్కో ప్రతినిధులు కలిశారు
- విజయసాయి ప్రశ్నకు బదులుగా కేంద్ర మంత్రి సమాధానం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం బలపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన విషయాలను వెల్లడించారు. పోస్కో, విశాఖ ప్లాంట్ కు మధ్య 2019 అక్టోబర్ లో ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు.
ఒప్పందం కుదిరిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ను పోస్కో ప్రతినిధులు కలిశారని చెప్పారు. విశాఖ ప్లాంట్ ను పోస్కో బృందం ఇప్పటికే మూడు సార్లు సందర్శించిందని తెలిపారు. భూముల అప్పగింతకు కూడా ఒప్పందం కుదిరిందని చెప్పారు. కొత్త ప్లాంట్ లో పోస్కో వాటా 50 శాతంగా ఉంటుందని, ఎన్ఐఎన్ఎల్ వాటా ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్ర మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.