భారత చట్టాలకు అనుగుణంగా లేని ప్రభుత్వ ఆదేశాలివి: ట్విట్టర్ సంచలన వ్యాఖ్యలు
- ఇప్పటికే పలు ఖాతాలను తొలగించిన ట్విట్టర్
- ఇండియాలో మాత్రమే నిషేధించాం
- మిగతా దేశాల్లో ఖాతాలు అందుబాటులోనే ఉంటాయి
- బ్లాగ్ లో పేర్కొన్న ట్విట్టర్
మొత్తం 1,178 ఖాతాలను తక్షణం ఆపివేయాలని, లేకుంటే అరెస్ట్ తప్పదని భారత ప్రభుత్వం చేసిన హెచ్చరికల నేపథ్యంలో పలు ఖాతాలను ఇప్పటికే తొలగించిన ట్విట్టర్, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత ప్రభుత్వం నుంచి తమకు అందిన ఆదేశాలు చట్ట విరుద్ధమని, ఈ ఖాతాలను భారత్ లో మాత్రమే నిషేధించామని, మిగతా దేశాల్లో అందుబాటులోనే ఉంటాయని తన బ్లాగ్ పోస్ట్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది. చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ ఆదేశాలను పూర్తిగా పాటించలేమని, వీటిని పూర్తిగా నిలిపివేయడం లేదని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ సొంతమేనని, వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛగా భావాలను వ్యక్తీకరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని వ్యాఖ్యానించిన ట్విట్టర్, ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇదే విధమైన పరిస్థితి నెలకొని వుందని పేర్కొంది.
"మాకు అందిన ఆదేశాలు భారత న్యాయ వ్యవస్థకు, చట్టాలకు అనుగుణంగా లేవని మేము భావిస్తున్నాము. ఈ ఖాతాలపై మేము పూర్తి చర్యలు తీసుకోలేము. వీటిల్లో మీడియా సంస్థలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కార్యకర్తల ఖాతాలు కూడా ఉన్నాయి. వీటిని నిషేధిస్తే, భారత రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యపు హక్కును హరించినట్టే. అది వారి ప్రాథమిక హక్కులో ఒకటన్నదే మా ఉద్దేశం" అని పేర్కొనడం గమనార్హం.