మరికాస్త పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- ఢిల్లీలో లీటరు పెట్రోల్ పై 30 పైసల పెరుగుదల
- పెట్రోలు లీటరుకి రూ.87.60
- హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.91.09
- డీజిల్ ధర లీటరుకి రూ.84.79
దేశంలో చమురు ధరలు మరికాస్త పెరిగాయి. లీటరు పెట్రోల్, డీజిల్‌పై 31 పైసల చొప్పున పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ పై 30 పైసల పెరుగుదల కనపడి రూ.87.60కి చేరింది. అలాగే, లీటరు డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ.77.73గా ఉంది.
ముంబైలో లీటరు పెట్రోల్ రూ.94.12, డీజిల్ ధర రూ.84.63కి చేరింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 31 పైసలు పెరిగి రూ.91.09కి చేరింది. డీజిల్ ధర లీటరుకి 27 పైసలు పెరిగి రూ.84.79కి చేరింది. చెన్నైలో లీటరు పెట్రోలు ధర 26 పైసలు పెరిగి రూ.89.96కి చేరింది. అలాగే, డీజిల్ ధర లీటరుకి 24 పైసలు పెరిగి 82.90కి చేరింది.