ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి!
- విశాఖ లోని ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవం
- మా ఇంట మహాలక్ష్మి జన్మించింది
- ఆనందాన్ని వ్యక్తం చేసిన భర్త పరీక్షిత్ రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఇంట ఇప్పుడు ఆనందం వెల్లివిరుస్తోంది. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పుష్ప శ్రీవాణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన ఆమె భర్త, అరకు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందని తెలిపారు. ఇక పుష్ప శ్రీవాణికి ఆడబిడ్డ జన్మించిందని తెలుసుకున్న పలువురు అధికార పార్టీ నేతలు ఆ దంపతులకు శుభాభినందనలు తెలియజేస్తున్నారు.