తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

  • నిన్న 35 వేల మందికి దర్శనం
  • హుండీ ద్వారా సుమారు రూ. 2.5 కోట్ల ఆదాయం
  • రథసప్తమికి ఏర్పాట్లు పూర్తి
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆది, సోమవారాలతో పోలిస్తే, స్వామి దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య తగ్గింది. నిన్న దాదాపు 35 వేల మంది వెంకన్నను దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ ద్వారా రూ. 2.50 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందన్నారు. ఈ నెల 19న జరిగే రథసప్తమి వేడుకల కోసం మాడ వీధులను, ఆలయాన్ని అలంకరించే పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. లాక్ డౌన్ తరువాత తొలిసారిగా మాడ వీధుల్లో స్వామి ఏడు వాహనాలపై ఊరేగుతూ, భక్తులకు కనిపించనున్నారని, ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.


More Telugu News