శశికళ వచ్చినా మాకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు: బీజేపీ జాతీయ కార్యదర్శి రాజా
- అన్నాడీఎంకే పార్టీకి, ప్రభుత్వానికి శశికళతో ఇబ్బంది లేదు
- ఈ పదేళ్లలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించింది
- మోదీ చొరవతో రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనంతరం విడుదలైన శశికళ చెన్నై చేరుకున్నారు. మద్దతుదారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రియాశీల రాజకీయాల్లో ఉంటానని చెప్పడంతో తమిళ రాజకీయాల్లో వేడి మొదలైంది. అధికార అన్నాడీఎంకే మాత్రం ఆమెను చేర్చుకునేది లేదని తెగేసి చెబుతుండగా, దినకరన్ మాత్రం అన్నాడీఎంకేపై శశికళ మళ్లీ పట్టు సాధిస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు, ఆమె రాకతో అధికార అన్నాడీఎంకేకు కానీ, ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా పేర్కొన్నారు. నిన్న ఆయన విల్లుపురంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వ చొరవ కారణంగా తమిళ ప్రభుత్వానికి మరిన్ని సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పదేళ్లలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించిందని రాజా వివరించారు.