జగన్ పై లోక్ సభలో విమర్శలు గుప్పించిన కేశినేని.. అడ్డుకున్న వైసీపీ ఎంపీలు

  • పోలవరంకు నిధులు తీసుకురాలేక పోయారు
  • ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు
  • రాష్ట్ర అప్పులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని లోక్ సభలో తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు.

జగన్ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని అన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన జగన్... అధికారంలోకి వచ్చాక హోదాను పూర్తిగా విస్మరించారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కూడా తీసుకురాలేకపోయారని అన్నారు.

అమరావతి అభివృద్ధిని జగన్ అడ్డుకున్నారని కేశినేని నాని మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని... అప్పులు మాత్రం అమాంతం పెరుగుతున్నాయని చెప్పారు. జగన్ పై కేశినేని నాని విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఆయన ప్రసంగాన్ని వైసీపీ ఎంపీలు అడ్డుకున్నారు. కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.


More Telugu News