నిమ్మాడలో అచ్చెన్నాయుడు అన్న కుమారుడు సురేశ్ విజయం

నిమ్మాడలో అచ్చెన్నాయుడు అన్న కుమారుడు సురేశ్ విజయం
  • ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
  • కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
  • తొలి దశ ఎన్నికలపై ఎస్ఈసీ సంతృప్తి
  • గతంతో పోలిస్తే ఈసారి ప్రశాంతంగా జరిగాయని వెల్లడి
  • ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ అభినందనలు
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కింజరాపు సురేశ్ విజయం సాధించారు. సురేశ్ టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడి అన్న హరిప్రసాద్ కుమారుడు. సర్పంచ్ గా సురేశ్ అభ్యర్థిత్వాన్ని టీడీపీ బలపర్చింది. నిమ్మాడ పంచాయతీ ఎన్నికల సందర్భంగానే అచ్చెన్న అరెస్టయిన సంగతి తెలిసిందే. వైసీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కింజరాపు అప్పన్నను బెదిరించాడంటూ అచ్చెన్నపై ఆరోపణలు వచ్చాయి.

కాగా, తొలి దశ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. తొలి దశ ఎన్నికల్లో 81 శాతం పోలింగ్ నమోదైనట్టు వెల్లడించింది. గతంతో పోలిస్తే ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని వివరించింది. ఎన్నికలు సజావుగా నిర్వహించారంటూ అధికారులకు అభినందనలు తెలిపింది.


More Telugu News