లక్ష్మీపార్వతి పిటిషన్ పై వాదనలు వినిపిస్తామని కోరే హక్కు చంద్రబాబుకు లేదు: ఏసీబీ న్యాయస్థానం

  • చంద్రబాబు అక్రమాస్తులు సంపాదించారన్న లక్ష్మీపార్వతి
  • ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించాలని కోర్టులో పిటిషన్
  • తమ వాదనలు కూడా వినాలన్న చంద్రబాబు
  • చంద్రబాబు పిటిషన్ ను తిరస్కరించిన న్యాయమూర్తి
టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆస్తులపై నిగ్గు తేల్చాలంటూ వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అక్రమాస్తులు పోగేశారని, వాటిపై ఏసీబీ దర్యాప్తు చేయించాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. అయితే లక్ష్మీపార్వతి పిటిషన్ పై విచారణ సందర్భంగా తమ వాదనలు కూడా వినాలని చంద్రబాబు చేసుకున్న అభ్యర్థనను ఏసీబీ న్యాయస్థానం తోసిపుచ్చింది. వాదనలు వినిపిస్తామని కోరే హక్కు చంద్రబాబుకు లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

అటు, లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది స్పందిస్తూ... చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని, ప్రజాప్రతినిధుల కేసులు సత్వరమే విచారణ పూర్తిచేయాలన్న సుప్రీం ఆదేశాల మేరకు ఈ వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించాలని న్యాయమూర్తిని కోరారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.


More Telugu News