విజయసాయి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడు: బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి

  • వెంకయ్యనాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి
  • విజయసాయిపై పలువురి విమర్శలు 
  • వైసీపీ నేతల మాటలు దారుణం అన్న భానుప్రకాశ్  
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో విజయసాయి వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని చెప్పారు. అయితే, వెంకయ్యకు ఆయన క్షమాపణలు చెప్పకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ విజయసాయిపై విమర్శలు గుప్పించారు.

రాజ్యాంగ హోదాలో ఉండే వ్యక్తులపై వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు దారుణంగా ఉన్నాయని భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. రాజ్యసభ చైర్మన్ పై విజయసాయి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామని చెప్పారు. ఉపరాష్ట్రపతికి క్షమాపణలు చెప్పకుండా... చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని మాత్రమే విజయసాయి చెప్పడం సరికాదని అన్నారు. ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడని చెప్పారు. ఎన్నికల సమయంలో 'రావాలి జగన్, కావాలి జగన్' అన్న ఏపీ ప్రజలు... ఇప్పుడు జగన్ పాలన తమకు వద్దని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.


More Telugu News