2022 నాటికి పెట్టుబడుల ఉపసంహరణ పూర్తి: ప్రధాని మోదీ

  • నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలపై కేంద్రం కీలక నిర్ణయం
  • వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందన్న మోదీ
  • రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నట్టు వెల్లడి
  • 2021-22లో ఎల్ఐసీ ఐపీవోకు వెళుతుందని వివరణ
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్రం పెట్టుబడులను ఇక కొనసాగించకూడదన్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందని వెల్లడించారు.

బీపీసీఎస్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హన్స్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సంస్థల నుంచి వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ 2021-22 నాటికి పూర్తవుతుందని వివరించారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్ ఇన్సూరెన్స్ సంస్థను ప్రైవేటీకరిస్తున్నట్టు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఐపీవోకు వెళుతుందని మోదీ పేర్కొన్నారు.

అటు, రైతు ప్రయోజనం కోసం ప్రాథమిక కస్టమ్స్ సుంకంలో మార్పులు చేసినట్టు వివరించారు. పత్తిపై కస్టమ్స్ సుంకాన్ని సున్నా నుంచి 10 శాతానికి పెంచామని, ముడిపట్టు, పట్టునూలుపై సుంకాన్ని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచినట్టు పేర్కొన్నారు.


More Telugu News