నా జీవితంలో ఒక్కసారి కూడా పాకిస్థాన్ కు వెళ్లలేదు: ఆజాద్

  • హిందుస్థాన్ ముస్లింగా నేను ఎంతో గర్విస్తున్నా
  • వాజ్ పేయి నుంచి సభను ఎలా నడపాలనే విషయాన్ని నేర్చుకున్నా
  • రాజ్యసభలో సహచరులకు ధన్యవాదాలు తెలిపిన ఆజాద్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజ్యసభ పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయనకు వీడ్కోలు పలికే అశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఆజాద్ తనకు నిజమైన స్నేహితుడని చెబుతూ, భావోద్వేగానికి గురయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ, తన సహచరులకు ధన్యవాదాలు తెలిపారు. జమ్మూకశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు సాగిన తన ప్రస్థానాన్ని గుర్తు తెచ్చుకున్నారు. సభను ఎలా నడపాలనే విషయాన్ని మాజీ ప్రధాని వాజ్ పేయి నుంచి తాను నేర్చుకున్నానని చెప్పారు. సభలో ప్రతిష్టంభన నెలకొంటే, దాన్ని ఎలా తొలగించాలనే విషయాన్ని ఆయన నుంచే నేర్చుకున్నానని తెలిపారు.

హిందుస్థాన్ కు చెందిన ముస్లింగా తాను ఎంతో గర్విస్తున్నానని ఆజాద్ చెప్పారు. తన జీవితంలో తాను ఒక్కసారి కూడా పాకిస్థాన్ కు వెళ్లలేదని, ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతుడినని చెప్పారు.


More Telugu News