ఆ ఒక్క ప్రొటీన్ తో మన దగ్గర కరోనా కొత్త స్ట్రెయిన్ కు అడ్డుకట్ట!
- ఆసియా ప్రజల్లో ఏఏటీ ప్రొటీన్
- అమెరికా, యూరప్ ప్రజల్లో కనిపించని వైనం
- అది లేకపోవడం వల్లే అక్కడ విచ్చలవిడిగా వ్యాప్తి
- భారత శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
ఐరోపా దేశాలు, అమెరికాతో పోలిస్తే ఆసియాలో ప్రస్తుతం కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. కొత్త కేసులూ తక్కువగానే వస్తున్నాయి. ఇటు, బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లోని కొత్త స్ట్రెయిన్ కేసులూ మన దగ్గర తక్కువే. కానీ, యూరప్, అమెరికాల్లో మాత్రం కొత్త స్ట్రెయిన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
దీనికి కారణమేంటి? భారత శాస్త్రవేత్తలు దానికి ఓ శాస్త్రీయ ఆధారం గుర్తించారు. ఆసియా వాసుల్లో ఉండే కరోనా వైరస్ ఎదుగుదలకు దోహదపడే ప్రొటీన్ ను అణచివేసే ఓ రకం ప్రొటీన్.. ఐరోపా దేశాలు, అమెరికా ప్రజల్లో లేదని, దాని వల్లే ఆయా చోట్ల కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని తేల్చారు.
పశ్చిమబెంగాల్ లోని కల్యాణిలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేశారు. మనిషి కణాల్లోకి వైరస్ తేలికగా ప్రవేశించి.. వేగంగా వృద్ధి చెందేందుకు న్యూట్రోఫిల్ ఎలాస్టేస్ అనే ప్రొటీన్ దోహదపడుతుంది. ఆసియా వాసులతో పోలిస్తే ఆ ప్రొటీన్ ఐరోపా దేశాలు, అమెరికా ప్రజల్లో ఎక్కువగా ఉంది.
అయితే, ఆ ప్రొటీన్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చెక్ పెట్టే ఆల్ఫా 1 యాంటీ ట్రిప్సిన్ (ఏఏటీ) అనే ప్రొటీన్ ఆసియా ప్రజల్లో ఎక్కువగా ఉందని, ఐరోపా, అమెరికా ప్రజల్లో అసలు లేదని భారత శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ ఏఏటీ లేకపోవడం వల్లే ఆయా దేశాల్లో కొత్త రకం కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన నిధాన్ బిశ్వాస్, పార్థా మజుందార్ లు చెప్పారు. డీ614జీ అనే కొత్త రకం కరోనా వ్యాప్తి ప్రపంచమంతటా ఒకేలా లేదన్నారు. తూర్పు ఆసియాలో ఆ రకం కరోనా కేసులు వేగంగా వ్యాపించడానికి ఐదున్నర నెలల టైం పడితే.. యూరప్ లో 2.15 నెలలు, ఉత్తర అమెరికాలో 2.83 నెలలు పట్టిందని నిర్ధారించారు.
ఆసియాలో ఏఏటీ లోపం అతి కొద్ది మందిలోనే ఉందన్నారు. తూర్పు ఆసియా దేశాలైన మలేసియాలో ప్రతి వెయ్యి మందిలో ఎనిమిది మందికి, దక్షిణ కొరియాలో 5.4 మందికి, సింగపూర్ లో 2.5 మందికి మాత్రమే ఏఏటీ లోపం ఉన్నట్టు గుర్తించారు. అదే స్పెయిన్ లో అత్యధికంగా ప్రతి వెయ్యి మందిలో 67.3 మందికి ఏఏటీ లోపం ఉన్నట్టు నిర్ధారించారు.
బ్రిటన్ లో 34.6 మందికి, ఫ్రాన్స్, అమెరికాలో వెయ్యిలో 29 మందికి చొప్పున ఏఏటీ ప్రొటీన్ లోపం ఉందని చెప్పారు. ఈ ప్రొటీన్ తో పాటు భౌగోళిక, శారీరక పరిస్థితులూ ఆసియా దేశాల్లో కొత్త కరోనా కేసులు తక్కువ నమోదవడానికి కారణమయ్యాయని చెబుతున్నారు.