పోరాటాన్ని కొనసాగిద్దాం... అచ్చెన్నాయుడికి చంద్రబాబు ఫోను!
- అచ్చెన్న చేస్తోన్న పోరాటం పట్ల అభినందలు
- ఏపీ సర్కారు పాల్పడుతోన్న చర్యలపై పోరాటాన్ని కొనసాగిద్దాం
- అచ్చెన్నాయుడు ఆదర్శంగా నిలిచారు
- సర్కారుకి ప్రజలే బుద్ధి చెబుతారు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ మద్దతు ఇస్తున్న సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణలపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండుకు పంపగా, శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి, ఆయన చేస్తోన్న పోరాటం పట్ల అభినందలు తెలిపారు.
ఏపీ సర్కారు పాల్పడుతోన్న చర్యలపై పోరాటాన్ని కొనసాగిద్దామని ఆయన చెప్పారు. ఈ విషయంలో పోరాటం చేస్తూ అచ్చెన్నాయుడు ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు అన్నారు. ఏపీలో బీసీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్న సర్కారుకి ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. సర్కారు పాల్పడుతోన్న అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే అచ్చెన్నాయుడుపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు.