చెన్నై టెస్టులో విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం.. హాఫ్ సెంచరీ చేసిన కెప్టెన్
- క్రీజులో కోహ్లీ (51), రవిచంద్రన్ అశ్విన్ (9)
- టీమిండియా స్కోరు 47 ఓవర్లకు 159/6
- ఇంకా 261 వెనకబడి ఉన్న భారత్
చెన్నైలో ఇంగ్లండ్ తో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్స్ చివరిరోజు ఆటలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ చేశాడు. 35 ఓవర్లలోపే ఆరు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడి ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో కోహ్లీ క్రీజులో నిలదొక్కుకుని వికెట్ పడకుండా ఆడుతున్నాడు... ఒంటరి పోరాటం చేస్తున్నాడు. నాలుగు ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు.
క్రీజులో రవిచంద్రన్ అశ్విన్ (9) కూడా వికెట్ పడకుండా ఆడుతూ కోహ్లీకి చక్కని సహకారాన్ని అందిస్తున్నాడు. భారత బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ 12, శుభ్‌మన్ గిల్ 50, పుజారా 15, అజింక్యా రహానె 0, రిషభ్ పంత్ 11, వాషింగ్టన్ సుందర్ 0 పరుగులకే ఔటైన విషయం తెలిసిందే. టీమిండియా స్కోరు 47 ఓవర్లకు 159/6 గా ఉంది.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578, రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులు చేసి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసింది. భారత్ ఇంకా 261 పరుగులు వెనకబడి ఉంది.