ఈ విష‌యాన్ని వెంట‌నే ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళతాం: సోమిరెడ్డి

  • నేతల్ని కొట్టి పోలీసులు బెదిరిస్తున్నారు    
  • కావలి డివిజన్‌లో పోలీసుల తీరు సరికాదు
  • అల్లూరు ఎస్సై పోలీసా? వైసీపీ నాయకుడా?
  • ఉత్త‌ర‌ ఆములూరులో పోలీసుల తీరుపై ఫిర్యాదు
ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో చోటు చేసుకుంటోన్న ప‌లు ప‌రిణామాల‌పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... నెల్లూరు జిల్లాలోని తొలి విడత ఎన్నికలు జరుగుతున్న కావలి డివిజన్‌లో పోలీసులు ప్ర‌ద‌ర్శిస్తోన్న‌ తీరు దుర్మార్గమని అన్నారు.

అల్లూరు ఎస్సై పోలీసా? లేక వైసీపీ నాయకుడా? అంటూ ఆయ‌న నిల‌దీశారు. ఉత్త‌ర‌ ఆములూరులో ఎన్నికల ఏజెంట్లను, టీడీపీ నేతల్ని కొట్టి బెదిరించ‌డం ఏంట‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించాల‌ని, పోలీసులను అదుపు చేయాలని ఆయ‌న అన్నారు. పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని, ఈ విష‌యాన్ని తాము వెంట‌నే ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళుతున్నామని తెలిపారు.


More Telugu News