నిమ్మగడ్డ వల్ల ఈ మాత్రమైనా ఎన్నికలు జరుగుతున్నాయి: గోరంట్ల
- వైసీపీ భయానక వాతావరణం సృష్టిస్తోంది
- ఆత్మహత్యల పేరుతో హత్యా రాజకీయాలు చేస్తున్నారు
- నిమ్మగడ్డ లేకపోతే ఎన్నికలు ఏకపక్షంగా జరిగేవి
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు తొలి విడత పోలింగ్ జరుగుతోంది. మరోవైపు పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ఎక్కడికక్కడ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. తమ అభ్యర్థులను బెదిరిస్తూ, విత్ డ్రాలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. ఆత్మహత్యల పేరుతో హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ చర్యలు తీసుకోవడం వల్ల ఈ మాత్రమైనా ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. నిమ్మగడ్డ చర్యలు తీసుకోకపోతే ఎన్నికలు ఏకపక్షంగా జరిగేవని చెప్పారు. ఎన్నికల కమిషనర్ ను వైసీపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు పలుచోట్ల అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని అన్నారు.