వెలగని వీధి దీపాలు... చీకట్లోనే ప్రయాణించిన కేసీఆర్ కాన్వాయ్!

  • నిన్న టీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ సమావేశం
  • బంజారాహిల్స్ ప్రాంతంలో వెలగని వీధి దీపాలు
  • చీకట్లోనే విధులు నిర్వహించిన పోలీసులు
  • లైట్లు వెలగడం లేదని చెప్పినా స్పందించని విద్యుత్ శాఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కాన్వాయ్ నిన్న రాత్రి చీకట్లో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ బృందాలు ఉన్నతాధికారులకు నివేదికను అందించాయి. సీఎం వెళుతున్న మార్గంలో హైమాస్ట్ దీపాలు వెలగకపోవడంతో మార్గమంతా చీకటిగా మారిపోయింది. నిన్న టీఆర్ఎస్ భవన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమైన సంగతి తెలిసిందే.  

ఆపై తిరిగి ప్రగతి భవన్ కు చేరుకునే నిమిత్తం రోడ్ నంబర్ 3 మీదుగా కేసీఆర్ కాన్వాయ్ బయలుదేరింది. ఆ సమయంలో కేబీఆర్ పార్క్ జంక్షన్, మధ్యలో డివైడర్ పై ఏర్పాటు చేసిన లైట్లు ఏవీ వెలుగుతూ లేవు. దీన్ని ముందే గమనించిన బంజారాహిల్స్ పోలీసులు, విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినా, సకాలంలో వారు స్పందించలేదు. దీంతో రాత్రి 7.45 గంటల మధ్య ఆ చీకట్లోనే కేసీఆర్ కాన్వాయ్ వెళ్లాల్సి వచ్చింది. బందోబస్తులో ఉన్న పోలీసులు కూడా చీకట్లోనే విధులు నిర్వహించారు.


More Telugu News