మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అరెస్ట్.. ప్రొద్దుటూరులో ఉద్రిక్తత
- తమ ఇంట్లోకి చొరబడి బెదిరించారంటూ వైసీపీ నేత భార్య ఫిర్యాదు
- విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన అనుచరుల ఆందోళన
- వైద్య పరీక్షల అనంతరం కడప జైలుకు తరలింపు
మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని ప్రొద్దుటూరు పోలీసులు నిన్న అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. ఆయన అనుచరులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని వరదరాజులును విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు. వైసీపీ నేత నంద్యాల బాల వరదరాజులరెడ్డి భార్య సరోజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
వరదరాజులరెడ్డి, ఆయన సోదరుడు రాఘవరెడ్డి ఇంట్లోకి చొరబడి తమను బెదిరించినట్టు సరోజ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ వైసీపీ నేతలు గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతుండగా చూసి అడ్డుకున్నామని, అది జీర్ణించుకోలేకే తప్పుడు కేసులు పెట్టారని వరదరాజులరెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. కాగా, వరదరాజులురెడ్డిని అరెస్ట్ చేసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం రిమాండ్ కోసం కడప జైలుకు తరలించారు.