ఏపీ పంచాయతీ పోల్స్.. మరికాసేపట్లో ప్రారంభం కానున్న తొలి విడత పోలింగ్

  • 12 జిల్లాలలో తొలి విడత ఎన్నికలు
  • సర్పంచ్ బరిలో 7,506, వార్డు బరిలో 43,601 మంది
  • కరోనా సోకిన వారికి ప్రత్యేక సమయాలు
ఆంధప్రదేశ్‌లో మరికాసేపట్లో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా, సర్పంచ్ స్థానాలకు 7,506 మంది, 20157 వార్డు స్థానాలకు 43,601 మంది బరిలో ఉన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 3,249 గ్రామ పంచాయతీల్లో 525 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏక్రగీవం అయిన వాటికి కూడా నిన్న ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గుర్తుల కేటాయింపులో పొరపాట్ల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని వడ్డిగూడెం, బొప్పనపల్లిలో వార్డు ఎన్నికలను రెండో దశకు వాయిదా వేశారు.  మొత్తం 32,502 వార్డు సభ్యుల స్థానాల్లో 12,185 ఏకగ్రీవం అయ్యాయి. 160 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేసిన అధికారులు కరోనా సోకిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారి కోసం ప్రత్యేక సమయాలు కేటాయించారు.


More Telugu News