'పేట్ట' దర్శకుడితో మరోసారి రజనీకాంత్!
- యంగ్ డైరెక్టర్లతో చేస్తున్న రజనీకాంత్
- ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'అన్నాత్తే'
- 'పేట్ట' దర్శకుడితో సినిమా ప్లానింగ్
- స్క్రిప్ట్ చేస్తున్న కార్తీక్ సుబ్బరాజు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలి కాలంలో యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. యువ దర్శకులైతే తనను డిఫరెంట్ స్టయిల్ లో ప్రెజంట్ చేయగలిగే అవకాశం ఉంటుందన్నది ఆయన నమ్మకం. అందుకు తగ్గట్టే ఆయా దర్శకులు ఆయనను కొత్తగా చూపిస్తున్నారు కూడా. ఈ క్రమంలో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.
ఆమధ్య కార్తీక్ దర్శకత్వంలో రజనీకాంత్ 'పేట్ట' సినిమా చేసిన సంగతి విదితమే. అందులో రజనీని ఆయన చాలా డిఫరెంట్ గా చూపించాడు. ఆ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది కూడా. ఇప్పుడు మళ్లీ వీరి కలయికలో మరో చిత్రాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. కార్తీక్ సుబ్బరాజు ప్రస్తుతం దీనికోసం స్క్రిప్ట్ పనిచేస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం రజనీ తన తాజా చిత్రాన్ని శివ దర్శకత్వంలో చేస్తున్నారు. 'అన్నాత్తే' పేరిట రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే దీపావళికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే కార్తీక్ తన తాజా చిత్రాన్ని విక్రమ్, ధృవ్ కాంబోలో చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక రజనీ, కార్తీక్ ల సినిమా సెట్స్ కి వెళుతుందని అంటున్నారు.