అందుకే నిమ్మగడ్డ ఎర్రగడ్డలోనే చూపించుకోవాలి: విజయసాయిరెడ్డి

  • జిల్లాల్లో పర్యటిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ
  • కంటి ఇన్ఫెక్షన్ కు గురైన ఎస్ఈసీ
  • కడప జిల్లా పర్యటన వాయిదా
  • వ్యంగ్యంగా స్పందించిన విజయసాయి
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన కంటి ఇన్ఫెక్షన్ కు గురికావడంతో కడప జిల్లా పర్యటన వాయిదా పడింది. నిమ్మగడ్డ హుటాహుటీన హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి బయల్దేరారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా స్పందించారు.

నిమ్మగడ్డ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లాడని, ఆ ఆసుపత్రిని ఆనుకునే టీడీపీ ఆఫీసు ఉందని వెల్లడించారు. అయితే ఈ రెండింటికి సంబంధం ఉందని జనం అనుకుంటున్నారని తెలిపారు. కంటికి ఇన్ఫెక్షన్ ఉంటే బాగవుతుంది కానీ, చూసే విధానమే బాగులేకపోతే..? అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. అందుకే నిమ్మగడ్డ ఎర్రగడ్డలోనే చూపించుకోవాలంటూ ఎద్దేవా చేశారు.


More Telugu News