రేపు పంచాయతీ తొలి విడత ఎన్నికలు... ఇప్పటిదాకా జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వకపోవడం దారుణం: వర్ల రామయ్య
- తొలి విడత ఎన్నికలకు రంగం సిద్ధం
- మీడియా ప్రతినిధులకు ఇలాంటి పరిస్థితి బాధాకరమన్న వర్ల
- వారిని కవరేజీ నుంచి దూరం చేయరాదని హితవు
- ఎస్ఈసీ, సీఎస్ స్పందించాలని వినతి
ఏపీలో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అయితే, ఇంతవరకు జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వకపోవడం దారుణమని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. ఫోర్త్ ఎస్టేట్ గా పేర్కొనే మీడియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాత్రికేయులకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలిపారు.
ఎన్నికల ప్రక్రియ కవరేజీ నుంచి వారిని దూరం చేయడం తగదని హితవు పలికారు. ఇది ఎంతో కీలకమైన అంశం అని, దీనిపై ఎస్ఈసీ, రాష్ట్ర సీఎస్ తక్షణమే స్పందించాలని వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రక్రియ కవరేజీ నుంచి వారిని దూరం చేయడం తగదని హితవు పలికారు. ఇది ఎంతో కీలకమైన అంశం అని, దీనిపై ఎస్ఈసీ, రాష్ట్ర సీఎస్ తక్షణమే స్పందించాలని వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు.