అన్నాడీఎంకే పార్టీ నాదే: చెన్నైలో శశికళ కీలక వ్యాఖ్యలు
- ఇకపై ప్రజా జీవితంలో ఉంటా
- క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతా
- ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు
దివంగత జయలలిత నెచ్చెలి శశికళ చెన్నైకి చేరుకున్నారు. నాలుగేళ్ల జైలు జీవితం తర్వాత తమిళగడ్డపై అడుగుపెట్టిన ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె తన రాజకీయ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను ప్రజా జీవితంలో ఉంటానని, క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు.
తాను ఎవరికీ భయపడనని అన్నారు. తనను వ్యతిరేకించిన వారికి తనేమిటో అర్థమయి ఉంటుందని, అన్నాడీఎంకే పార్టీ నేతలు వణికిపోతున్నారని చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ తనదేనని కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మ వారసత్వాన్ని తాను కొనసాగిస్తానని చెప్పారు. మరోవైపు, శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా ఉండటం గమనార్హం. జైలుకు వెళ్లేముందు జయ సమాధిపై ఆమె శపథం చేసి వెళ్లిన సంగతి తెలిసిందే.