అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు... ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కారు

  • ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు లబ్ది
  • విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు
  • బలహీన వర్గాలకు ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు
  • వాటికి అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటా
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారికి లబ్ది చేకూర్చేందుకు ఉద్దేశించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు  అందుబాటులోకి రానున్నాయి. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింప చేస్తామని తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. త్వరలోనే విడుదలయ్యే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లకూ ఈడబ్ల్యూఎస్ వర్తింప చేస్తారని తెలుస్తోంది. తెలంగాణలో బలహీన వర్గాలకు ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తాజాగా ప్రకటించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వాటికి అదనం కానున్నాయి.


More Telugu News