ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 178 ఆలౌట్... టీమిండియా టార్గెట్ 420 రన్స్

  • చెన్నైలో భారత్, ఇంగ్లండ్ మధ్య తొలిటెస్టు
  • రవిచంద్రన్ అశ్విన్ కు రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు
  • భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లండ్
  • మరోసారి టాప్ స్కోరర్ గా రూట్
చెన్నె టెస్టులో భారత్ ముందు ఇంగ్లండ్ 420 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 178 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీయడం విశేషం. మరో స్పిన్నర్ షాబాజ్ నదీమ్ కు రెండు వికెట్లు దక్కాయి. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ జో రూట్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఓలీ పోప్ (28), జోస్ బట్లర్ (24), డామ్ బెస్ (25) కూడా తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ ఆధిక్యం 400 పరుగులు దాటింది. అయితే చివర్లో అశ్విన్ విజృంభించడంతో ఆ జట్టు వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది. భారీ లక్ష్య ఛేదన కోసం భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ బరిలో దిగారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 578 పరుగులు చేయగా, భారత్ 337 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.


More Telugu News