ఇన్ స్టా ప్రొఫైల్ లో పేరు మార్చుకున్న కాజల్ అగర్వాల్
- గౌతమ్ కిచ్లును పెళ్లాడిన కాజల్
- పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను కొనసాగిస్తున్న కాజల్
- 'కాజల్ ఎ కిచ్లు'గా పేరు మార్చుకున్న వైనం
అందాల భామ కాజల్ అగర్వాల్ ఇటీవలే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. హానీమూన్ సందర్భంగా తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి దిగిన ఫొటోలను అప్పట్లో ఆమె షేర్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు, పెళ్లి చేసుకున్నప్పటికీ తన కెరీర్ ని కొనసాగించేందుకు ఆమె నిర్ణయించుకుంది. తన కుటుంబ జీవితాన్ని, షూటింగులను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'ఆచార్యలో' తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసుకుంది.
మరో ఆసక్తికర అంశం ఏమిటంటే... కాజల్ తన పేరును మార్చుకుంది. తన భర్త పేరు కలిసి వచ్చేలా 'కాజల్ ఎ కిచ్లు' అని మార్చేసుకుంది. తన పేరు వెనుక భర్త పేరు వచ్చేలా ఇన్ స్ట్రాగ్రామ్ ప్రొఫైల్ లో మార్పులు చేసింది. మరోవైపు, వెబ్ సిరీస్ లలోకి కూడా కాజల్ ఎంట్రీ ఇచ్చింది. 'లైవ్ టెలికాస్ట్ ' అనే వెబ్ సిరీస్ లో ఆమె నటిస్తోంది.