సీఎం జగన్ విప్పింది కలమే.. గళం కాదు: మండలి బుద్ధప్రసాద్
- ఉద్యమ తీవ్రతను గుర్తించే లేఖ
- ఉద్యమానికి రాజకీయ పక్షాల మద్దతు అవసరం
- కానీ, వారి చేతుల్లో మాత్రం ఉద్యమాన్ని పెట్టొద్దు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్పింది కలమే కానీ, గళం కాదని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు ఉద్యమ సమయంలోనూ అప్పటి ముఖ్యమంత్రి ఇలాంటి లేఖలే కేంద్రానికి రాశారని, కానీ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటులో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పోరాటం ఆగలేదని అన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం తీవ్రతను గుర్తించిన తర్వాతే జగన్ ఆ లేఖ రాశారని విమర్శించారు.
ఉద్యమానికి దిగిన కార్మిక, ఉద్యోగ సంఘాలకు రాజకీయ పక్షాల మద్దతు కూడా అవసరమేనని, అయితే, ఉద్యమాన్ని మాత్రం వారి చేతుల్లో పెట్టవద్దని కోరారు. ఉద్యమం విషయంలో అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడేవారు కావాలని, సమైక్యాంధ్ర ఉద్యమంలో నాయకత్వం వహించిన అనుభవంతోనే తానీ మాట చెబుతున్నానని బుద్ధ ప్రసాద్ అన్నారు. నాడు సమైక్య నినాదాలు చేస్తూనే ఉద్యమానికి వెన్నుపోటు పొడిచారని బుద్ధ ప్రసాద్ గుర్తు చేసుకున్నారు.