విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడి పిటిషన్.. వేలాదిమంది మద్దతు
- చేంజ్ డాట్ ఆర్గ్‌లో పిటిషన్ ప్రారంభించిన ఎంపీ
- గత రాత్రి 12 గంటల వరకు 31,715 మంది మద్దతు
- లక్ష మంది మద్దతు తెలిపిన అనంతరం ప్రధానికి అందజేత
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడి ఆన్‌లైన్ పిటిషన్‌కు వేలాదిమంది మద్దతు లభిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ‘చేంజ్ డాట్ ఆర్గ్’లో ‘సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్’ పేరుతో ఎంపీ పిటిషన్ ప్రారంభించారు. దీనికి గత రాత్రి 12 వరకు 31,715 మంది మద్దతు తెలిపారు.
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని ఆ పిటిషన్‌లో రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌కు లక్ష మంది మద్దతు తెలిపిన అనంతరం దానిని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక, ఉక్కుశాఖ మంత్రులకు అందిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.