పవన్ కల్యాణ్ తాజా చిత్రానికి టైటిల్ ఖరారు?
- పవన్, క్రిష్ కలయికలో పిరీడ్ సినిమా
- కథానాయికలుగా నిధి అగర్వాల్, జాక్వెలిన్
- వజ్రాలదొంగగా నటిస్తున్న పవన్ కల్యాణ్
- 'హరిహర వీరమల్లు' టైటిల్ ఖరారు
పవన్ కల్యాణ్ వంటి ఎంతో ఇమేజ్ .. ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న స్టార్ హీరో సినిమాకి టైటిల్ నిర్ణయించడం మామూలు విషయం కాదు. చాలా కసరత్తు చేయాలి.. ఎన్నో పేర్లు పరిశీలించాలి.. ఎందరివో అభిప్రాయాలు తీసుకోవాలి. అందుకే, ఆయన సినిమాకి టైటిల్ నిర్ణయించడానికి చాలా సమయం పడుతుంటుంది. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా విషయంలో కూడా అలాగే టైటిల్ కోసం చాలా కసరత్తు చేశారు.
ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రం చారిత్రాత్మక కథా నేపథ్యంతో తెరకెక్కుతోంది. మొఘలాయీల కాలం నాటి వాతావరణంలో కథ సాగుతుంది. ఇందులో పవన్ వజ్రాలదొంగగా విభిన్న తరహా పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ చాలా కాలం వరకు ప్రచారంలో వుంది. ఆ తర్వాత మరికొన్ని టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. చివరికి తాజాగా 'హరిహర వీరమల్లు' అనే టైటిల్ని ఖాయం చేసినట్టు తెలుస్తోంది. యూనిట్ లో అందరికీ ఈ టైటిల్ నచ్చడంతో దీనినే ఖరారు చేశారట. త్వరలోనే అధికారికంగా దీనిని ప్రకటిస్తారని సమాచారం.
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతోంది. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం భారీ సెట్స్ కూడా వేస్తున్నారు.