మన సెలబ్రిటీల విమర్శలు ఎదుర్కొనేందుకు... ఏకమైన మియా కలీఫా, అమండా క్రేనీ, కెనడా ఎంపీ!

  • ఏ సిక్కు వేర్పాటవాదులు మాకు డబ్బిచ్చారు?
  • తెలిస్తే చెప్పండి?
  • ఎక్కడ, ఎప్పుడు, ఎంత తీసుకున్నాం?
  • ట్వీట్లు వదులుతున్న ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు
దాదాపు మూడు నెలలుగా ఢిల్లీ రాజధాని శివార్లలో ధర్నా చేస్తూ, వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తున్న రైతులకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతున్న వేళ, ఇండియా వ్యవహారాల్లో విదేశీయుల జోక్యం అవసరం లేదని భారత సెలబ్రిటీలు, ప్రముఖులు చేస్తున్న ట్వీట్లను ఎదుర్కొనేందుకు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ఏకమవుతున్నారు. మాజీ పోర్న్ స్టార్ మియా కలీఫా, మోడల్ అమందా క్రేనీ, కెనడా ఎంపీ జగమీత్ సింగ్ తదితరులు ఒకే మాటపై నిలిచి, తమపై విమర్శలు చేస్తున్న వారిని ఎదుర్కొంటున్నారు.

తొలుత మియా కలీఫా ట్వీట్ చేస్తూ, సాక్ష్యం లేకుండా విమర్శిస్తున్నామని తమపై రెచ్చిపోతున్న వారికి, ఇండియాలో రైతుల బాధ తెలియడం లేదా? అని ప్రశ్నించారు. తామంతా సిక్కు వేర్పాటువాదుల నుంచి డబ్బు తీసుకున్నామని ఆరోపించేందుకు మీ వద్ద ఏం సాక్ష్యాలున్నాయని ఆమె ప్రశ్నించారు. ఆ వెంటనే అమందా క్రేనీ తన ట్విట్టర్ ఖాతాలో మరో ట్వీట్ పెడుతూ, తన వద్ద ఎన్నో ప్రశ్నలకు జవాబు లేదని అన్నారు. తనకు ఎవరు డబ్బిచ్చారో చెప్పాలని, ఎంతిచ్చారో కూడా తెలియజేయాలని అడిగారు. ఎప్పుడు తనకు డబ్బులు ఇచ్చారో కూడా చెబితే బాగుంటుందని సెటైర్లు వేశారు.

ఇక ఇవే ట్వీట్లను రీట్వీట్ చేస్తూ, రూపీ కౌర్ తన ట్విట్టర్ ఖాతాలో మరో ట్వీట్ పెట్టారు. దానికి అమందా క్రేనీ, మియా కలీఫాలను జోడిస్తూ, సిక్కులు అసలు ఎందుకు డబ్బు చెల్లించాలని అడిగారు. భారత సర్కారు ప్రజల్లో విషం నింపుతున్నట్టు అనిపిస్తోందని కూడా ఆరోపించారు. దీనిపై మియా కలీఫా స్పందిస్తూ, రైతులకు మద్దతుగా తాను నేటి రాత్రి డిన్నర్ ను ఓ భారతీయ రెస్టారెంట్ లో చేయనున్నానని వ్యాఖ్యానించింది. ఈ డిన్నర్ చేయగానే ఆ వివరాలు తనకు చెప్పాలని రూపీ కోరింది. ఈ ట్వీట్లపై కెనడా ఎంపీ జగమీత్ సింగ్ కూడా స్పందించారు. తనకు డెజర్టులు పంపాలని ట్వీట్ చేశారు.

ఇక తాను చెప్పిన పని చేసిన మియా కలీఫా, ఓ రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తూ, సమోసా, బిర్యానీ, ఖీర్ తింటున్న ఫొటోను పోస్ట్ చేసింది. కాగా, పాప్ స్టార్ రిహన్నా ట్వీట్ తరువాత రైతుల సమస్యలు, వారి డిమాండ్లపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.


More Telugu News