టెన్నిస్ దిగ్గజం అక్తర్ అలీ కన్నుమూత.. మమతా బెనర్జీ సంతాపం
- మూత్ర సంబంధ సమస్యలతో బాధపడుతూ మృతి
- ఎంతోమందిని టెన్నిస్ చాంపియన్లుగా తీర్చిదిద్దిన అలీ
- ఆయనను అత్యున్నత క్రీడా పురస్కారంతో సత్కరించామన్న మమతా బెనర్జీ
మూత్ర సంబంధ సమస్యలతో బాధపడుతున్న నిన్నటి తరం భారత టెన్నిస్ దిగ్గజం అక్తర్ అలీ నిన్న కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. 1958 నుంచి 1964 వరకు ఎనిమిది డేవిస్ కప్‌లలో అలీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. రామనాథన్ కృష్ణన్, నరేష్ కుమార్, జైదీప్ ముఖర్జీ వంటి దిగ్గజాలతో కలిసి అలీ ఆడారు. 1966 నుంచి 1993 వరకు భారత జట్టు కోచ్‌గా పనిచేసిన ఆయన ఎంతోమందిని టెన్నిస్ చాంపియన్లుగా తీర్చి దిద్దారు. మలేషియా, బెల్జియం జట్లకు కూడా ఆయన కోచింగ్ ఇచ్చారు. భారత డేవిస్ కప్ జట్టు కోచ్ జీషన్ అలీ ఆయన కుమారుడే.
అక్తర్ అలీ మృతికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. అక్తర్ సర్ ఎంతోమందిని టెన్నిస్ చాంపియన్లుగా తీర్చిదిద్దారని కొనియాడారు. 2015లో బెంగాల్ ప్రభుత్వం తరపు అత్యున్నత క్రీడా పురస్కారంతో ఆయనను గౌరవించినట్టు గుర్తు చేశారు. ఆయన ప్రేమాభిమానాలు తనకు లభించడం తన అదృష్టమన్న మమత.. అలీ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.