ఏకగ్రీవాల కోసం అడ్డదారులు తొక్కుతున్న జగన్ నైతికంగా ఓడిపోయినట్టే: నారా లోకేశ్
- ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం
- అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
- టీడీపీ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం
- మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
స్థానిక ఎన్నికల సమరం నేపథ్యంలో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. బెదిరింపులకు భయపడి కొందరు, అధికార పార్టీకి తొత్తులుగా మారి మరికొందరు అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మాచర్ల రూరల్ మండలం జమ్మలమడక గ్రామ కార్యదర్శి టీడీపీ బలపర్చిన అభ్యర్థులకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
చట్టాలను గౌరవించకుండా ప్రలోభాలకు గురై తప్పులు చేస్తున్న కొంతమంది అధికారులు, తప్పుడు పనులు చేస్తూ బలవంతపు ఏకగ్రీవాలు చేస్తున్న వైసీపీ నాయకులు మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు. బలవంతపు ఏకగ్రీవాల కోసం అడ్డదారులు తొక్కుతున్న జగన్ రెడ్డి స్థానిక సమరంలో నైతికంగా ఓడిపోయినట్టేనని స్పష్టం చేశారు.