సూర్యాపేట జిల్లా గుర్రంపోడులో ఉద్రిక్తత... గిరిజనుల భూముల వివాదంలో పోలీసులకు గాయాలు!
- తమ భూములను కబ్జా చేశారంటూ గిరిజనుల ఆందోళన
- టీఆర్ఎస్ నేతలే కబ్జాలు చేశారన్న బీజేపీ నేతలు
- సర్వే నెంబరు 540లో షెడ్లను ధ్వంసం చేసిన గిరిజనులు
- బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి
సూర్యాపేట జిల్లా గుర్రంపోడులో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నాగార్జున సాగర్ నిర్వాసితుల భూములను కబ్జా చేశారని గిరిజనులు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు గిరిజనులకు మద్దతు పలికారు. గిరిజనుల భూములను టీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ తదితరులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో గిరిజనులు నిర్వాసిత భూముల్లోని సర్వే నెంబరు 540లో ఏర్పాటు చేసిన షెడ్లను కూల్చివేసేందుకు ప్రయత్నించారు. అయితే రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అనుచరులు గిరిజనులను ఆ భూముల్లోకి రాకుండా అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణలు జరిగాయి.
ఈ సందర్భంగా పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కూడా గాయాలు తగిలాయి. ఈ ఘర్షణల సందర్భంగా కోదాడ డీఎస్పీతో పాటు ఓ సీఐ, కానిస్టేబుల్ గాయపడ్డారు. కాగా, గుర్రంపోడులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, మహిళా నేత విజయశాంతి పర్యటించారు.