మద్య నిషేధం విధించాలని యోచిస్తున్నాం: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్
- మధ్యప్రదేశ్‌లో మద్యం లేకుండా చేయాలనుకుంటున్నాం
- అందుకు నిషేధం విధించడం మాత్రమే సరిపోదు
- మద్యం సేవించకుండా ప్రచార కార్యక్రమాలనూ నిర్వహిస్తాం
తమ రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలని యోచిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. అయితే, మధ్యప్రదేశ్‌లో మద్యం లేకుండా చేసేందుకు దానిపై నిషేధం విధించడం మాత్రమే సరిపోదని, మద్యం తాగే వారు ఉంటే అక్రమంగానయినా సరఫరా చేస్తూనే ఉంటారని చెప్పారు. కాబట్టి మద్యం సేవించకుండా ప్రచార కార్యక్రమాలనూ నిర్వహిస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్‌ను ఓ మంచి రాష్ట్రంగా మారుస్తామని చెప్పారు. దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.
బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాల్లోనూ మద్యంపై నిషేధం విధించాలంటూ గత నెల బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి అన్నారు. అయితే, మధ్యప్రదేశ్‌లో కొత్తగా మద్యం దుకాణాలు ప్రారంభిస్తామని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మద్యంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.