చిత్తూరు జిల్లాలో రాష్ట్రపతి పర్యటన... స్వాగతం పలికిన సీఎం జగన్
- బెంగళూరు నుంచి రేణిగుంట చేరుకున్న కోవింద్
- మదనపల్లెలో ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు హాజరు
- టీచర్లు, విద్యార్థులతో ముఖాముఖి
- సాయంత్రం బెంగళూరు పయనం
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం బెంగళూరు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి ఏపీ సీఎం జగన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, సీఎం జగన్ మధ్య స్వల్ప చర్చ జరిగింది. కాగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లా మదనపల్లెలోని చిప్పిలి వెళ్లనున్నారు.
అక్కడి సత్సంగ్ ఫౌండేషన్ లో యోగా వేదికను ప్రారంభించనున్నారు. సత్సంగ్ విద్యాలయంలో మొక్కలు నాటి, హీలింగ్ సెంటర్ కు భూమి పూజ చేస్తారు. ఆపై పీపల్ గ్రూప్ స్కూల్ కు చేరుకుని అక్కడి ఆవరణలో మొక్కలు నాటుతారు. స్కూల్ ఆడిటోరియంలో టీచర్లు, విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం ఈ సాయంత్రం బెంగళూరు పయనమవుతారు.