మీ ఉత్సాహం చూస్తుంటే ఆనందమేస్తోంది: ప్రధాని మోదీ
- అస్సాం పర్యటన సందర్భంగా దీపాలు వెలిగించిన మహిళలు
- మోదీజీ అని వచ్చేలా అమరిక
- ఆ ఫొటోలను ట్వీట్ చేసిన ప్రధాని
- అస్సాం అభివృద్ధికి సహకరిస్తామని హామీ
ఆదివారం అస్సాం పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. శనివారం ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. దీపాలు వెలిగిస్తున్న మహిళల ఫొటోలను పోస్ట్ చేసిన ఆయన.. వారి ఉత్సాహాన్ని చూస్తుంటే ముచ్చటేస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘అస్సాంలో ఇంత ఉత్సాహాన్ని చూస్తుంటే ఆనందమేస్తోంది. ఆ రాష్ట్రానికి మళ్లీ వెళ్లే అవకాశం రావడం సంతోషాన్నిస్తోంది. అన్ని రంగాల్లో అస్సాం అభివృద్ధి కోసం మా సహకారం కొనసాగుతుంది’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
అస్సాంలోని సోనిత్ పూర్ జిల్లా ధేకియాజూలిలో మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రెండు వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేయనున్నారు. అస్సాం మాల ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అస్సాం ఆర్థికంగా బలపడుతుందని, రహదారుల వ్యవస్థ మెరుగవుతుందని ప్రధాని అన్నారు. కాగా, ప్రధాని పర్యటన సందర్భంగా కొందరు మహిళలు శనివారం దీపాలు వెలిగించారు. అంతేగాకుండా మోదీజీ అని వచ్చేలా ఆ దీపాలను ఏర్పాటు చేశారు.