సౌతాఫ్రికాలో పుట్టిన కరోనాపై సమర్ధవంతంగా పనిచేయని ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్!

  • ఇప్పటికే జరిగిన ట్రయల్స్
  • పాల్గొన్న 2 వేల మంది
  • ఫలితాలు నిరాశాజనకమే
ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ సౌతాఫ్రికా కొవిడ్ వేరియంట్ పై చాలా తక్కువ ప్రభావాన్నే చూపుతోందని ఆస్ట్రాజెనికా ప్రకటించింది. దక్షిణాఫ్రికా వేరియంట్ పై తాము చేసిన పరిశోధనల ప్రాథమిక ఫలితాల అనంతరం ఈ విషయం తెలిసిందని పేర్కొంది. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పై సౌతాఫ్రికాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ విట్ వాటర్స్రాండ్, ఆక్స్ ఫర్డ్ తో కలిసి కొత్త స్ట్రెయిన్ పై పరిశోధనలు సాగించింది. దీని ఫలితాలు 'ఫైనాన్షియల్ టైమ్స్'లో ప్రచురితం అయ్యాయి.

సౌతాఫ్రికా వేరియంట్ తో పాటు బ్రిటీష్, బ్రెజిల్ కరోనా వేరియంట్ పైనా తాము పరిశోధనలు సాగించామని, ఇవి మామూలు కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తోందని పేర్కొంది. "సౌతాఫ్రికా స్ట్రెయిన్ సోకి స్వల్ప లక్షణాలు కనిపించే వారిలో మా వ్యాక్సిన్ పరిమిత ప్రభావాన్నే చూపిందని ఫేజ్ 1, 2 ట్రయల్స్ లో వెల్లడైంది" అని ఆస్ట్రాజెనికా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, తాము కేవలం 2 వేల మందినే పరిశీలించామని, వీరిలో ఎవరిలోనూ దుష్ప్రభావాలు కనిపించలేదని, ఎవరూ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రాలేదని తెలిపారు.



More Telugu News