ఫైబర్ నెట్ ఆన్ చేయగానే వైఎస్ జగన్ చిత్రం... ఈసీకి టీడీపీ ఫిర్యాదు!
- ఏపీలో మొదలైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ
- కోడ్ అమల్లో ఉండగా, ఫైబర్ నెట్ లో జగన్ చిత్రం
- వెంటనే తొలగించాలని టీడీపీ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలై, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో, ఫైబర్ నెట్ కనెక్షన్లు కలిగివున్న టీవీల్లో, ఆన్ చేయగానే సీఎం వైఎస్ జగన్ చిత్రం కనిపిస్తోందని టీడీపీ వర్గాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. కోడ్ నిబంధనల ప్రకారం అధికార పార్టీ నేతల చిత్రాలను తొలగించాల్సి వుందని గుర్తు చేస్తూ, టీవీ ఆన్ చేస్తే, డిఫాల్ట్ గా వైఎస్ జగన్ చిత్రం కనిపిస్తోందని, ఏపీలో 10 లక్షలకు పైగా ఫైబర్ నెట్ కనెక్షన్లు ఉన్నాయని వారు ఫిర్యాదు చేశారు. జగన్ చిత్రం కనిపించకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ఏపీ ఫైబర్ నెట్ ను ఆదేశించాలని తమ ఫిర్యాదులో టీడీపీ కోరింది.