గతంలో చంద్రబాబు ఎస్ఈసీని నేరుగా బెదిరించారు: వెల్లంపల్లి

  • జిల్లా అధికారులపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు
  • పెద్దిరెడ్డిని గృహనిర్బంధంలో ఉంచాలన్న ఎస్ఈసీ!
  • పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు మంత్రి వెల్లంపల్లి సమర్థన
  • ఎస్ఈసీ తీరు అప్రజాస్వామికం అంటూ విమర్శలు
జిల్లా అధికారులపై మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలను మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమర్థించారు. తప్పులు చేసే అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామని చెప్పడం తప్పెలా అవుతుందని అన్నారు. ప్రజాప్రతినిధులకు కూడా హక్కులు ఉన్నాయని, ఆ హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.

ఎస్ఈసీ నిమ్మగడ్డకు తగిన రీతిలో బదులిస్తామని చెప్పారు. నిమ్మగడ్డ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పెద్దిరెడ్డిని పంచాయతీ ఎన్నికలు అయిపోయేంత వరకు గృహనిర్బంధంలో ఉంచాలంటూ ఎస్ఈసీ వ్యాఖ్యానించడంపై వెల్లంపల్లి పైవిధంగా స్పందించారు.

గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అప్పటి ఎస్ఈసీని నేరుగా బెదిరించారని, ఒకవేళ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సి వస్తే ఉరి తీయాలని వెల్లంపల్లి అన్నారు.


More Telugu News