అమితవేగంతో భూమి దిశగా గ్రహశకలం... ముప్పులేదంటున్న నాసా
- స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి రెండు రెట్లు ఉన్న గ్రహశకలం
- 2020 ఎక్స్ యూరి అని నామకరణం
- ఈ నెల 22న భూమికి సమీపానికి రాక
- ఇది నేరుగా తాకే అవకాశాల్లేవన్న నాసా
ఈ విశాల భూమండలాన్ని కొన్ని గ్రహశకలాలు నేరుగా తాకిన సందర్భాలు ఉన్నాయి. ఆయా గ్రహశకలాల పరిమాణాన్ని అనుసరించి అవి భూమిపై ప్రభావం చూపే తీవ్రత ఆధారపడి ఉంటుంది. తాజాగా అమెరికా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి రెండు రెట్ల పరిమాణంలో ఉన్న ఓ గ్రహశకలం ఇప్పుడు భూమి దిశగా వస్తున్నట్టు శాస్త్రజ్ఞులు గుర్తించారు. దీనికి 2020 ఎక్స్ యూ6 అని నామకరణం చేశారు. దీని పొడువు 213 మీటర్లు కాగా, ఇది గంటకు 30,240 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తోంది. ఇది ఈ నెల 22 నాటికి భూమికి అత్యంత చేరువలోకి వస్తుందట.
అయితే దీని వల్ల ప్రమాదమేమీ లేదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చెబుతోంది. దీని వేగం దృష్ట్యా ఇది ప్రమాదకరమైనదే అయినప్పటికీ, ఇది నేరుగా భూమిని ఢీకొట్టే అవకాశాలు లేవని వెల్లడించింది. ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. కాగా, ఈ గ్రహశకలం ప్రయాణిస్తున్న వేగాన్ని పరిశీలిస్తే... మన భూమిని ఇది కేవలం 60 నిమిషాల్లో చుట్టి వస్తుందని శాస్త్రజ్ఞులు విశ్లేషించారు.