నేను ఇంట్లో ఉన్నా జరిగేది జరుగుతుంది... వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు: మంత్రి పెద్దిరెడ్డి
- మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలన్న ఎస్ఈసీ
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దిరెడ్డి
- నిమ్మగడ్డ తెలిసీ తెలియని మూర్ఖుడని విమర్శలు
- ఇంగితజ్ఞానం లేదని వ్యాఖ్యలు
- చంద్రబాబులాగే నిమ్మగడ్డకు కూడా పిచ్చి ముదిరిందని కామెంట్
ఈ నెల 21 వరకు తనను గృహ నిర్బంధంలో ఉంచేలా ఎస్ఈసీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయన్న వార్తలపై ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తాను ఇంట్లోనే ఉన్నా జరిగేది జరుగుతుందని, తాను తిరిగినా తిరగకపోయినా రాష్ట్రంలో వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
నిమ్మగడ్డకు ఇంగితజ్ఞానం లేదని, తెలిసీతెలియని మూర్ఖుడు అని నిప్పులు చెరిగారు. ఇంగితజ్ఞానం లోపించిన ఆదేశాలను అమలు చేయలేమని అన్నారు. నిమ్మగడ్డ ఆదేశాలను ఖాతరు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
చంద్రబాబులాగే నిమ్మగడ్డకు కూడా పిచ్చి ముదిరిందని విమర్శించారు. ఓ మంత్రిని ఇంటికే పరిమితం చేయాలన్న ఆలోచన దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాలను దుర్వినియోగం చేస్తున్న నిమ్మగడ్డ... చంద్రబాబుకు బంట్రోతులా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.
కాగా, మంత్రి పెద్దిరెడ్డి గృహనిర్బంధంపై ఎస్ఈసీ నుంచి తమకు ఆదేశాలు అందలేదని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఎస్ఈసీ లిఖితపూర్వకంగా ఆదేశిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.