నక్సల్స్​ పై పోరుకు మహిళా కమాండోలు

  • 6 బెటాలియన్లకు చెందిన 34 మంది నియామకం
  • మూడు నెలల పాటు కఠోర శిక్షణ
  • ఆ తర్వాత కోబ్రా బృందంలో బాధ్యతలు
నక్సలైట్ల ఏరివేతలో సీఆర్పీఎఫ్ బలగాలది కీలక పాత్ర. అడవుల్లో నక్సలైట్లను జల్లెడ పట్టడమంటే మాటలు కాదు. ఎప్పుడు, ఎవరు, ఎటు నుంచి దాడి చేస్తారో కనిపెట్టుకుంటూ కూంబింగ్ చేస్తుంటారు. అలాంటి క్లిష్టమైన కార్యకలాపాలకూ మహిళలు సిద్ధమైపోతున్నారు. అడవుల్లో నక్సలైట్ల ఆటకట్టించేందుకు నడుం బిగించబోతున్నారు.

6 మహిళా బెటాలియన్లకు చెందిన 34 మంది మహిళా సిబ్బందిని నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ లో సీఆర్పీఎఫ్ నియమించింది. అందులో భాగంగా వారికి మూడు నెలల పాటు కఠోరమైన శిక్షణను ఇచ్చి కోబ్రా బృందంలో బాధ్యతలు అప్పగించనున్నారు. శిక్షణ పూర్తయిన వెంటనే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో వారిని మోహరించనున్నారు.


More Telugu News