రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్ వేలానికి అర్జున్ టెండూల్కర్
- ఈ నెల 18న చెన్నైలో ఐపీఎల్ వేలం
- వేలంలో మొత్తం 1,097 మంది ఆటగాళ్లు
- ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడడంతో ఐపీఎల్‌కు అర్హత
ఈ ఏడాది భారత్‌లోనే జరుగుతుందని భావిస్తున్న ఐపీఎల్ మ్యాచ్ లలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కనిపించే అవకాశం ఉంది. ఈ నెల 18న చెన్నైలో మెగాటోర్నీ వేలం నిర్వహించనుండగా మొత్తం 1,097 మంది స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు వేలంలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో జూనియర్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. 21 ఏళ్ల అర్జున్ రూ. 20 లక్షల కనీస ధరతో వేలానికి తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు.
అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకు దేశవాళీ టోర్నీలలో ఆడకపోవడంతో ఐపీఎల్ గత సీజన్లలో వేలానికి దరఖాస్తు చేసుకోలేకపోయాడు. అండర్-19లో ఆడినప్పటికీ దేశవాళీ టోర్నీలలో ఆడాలన్న నిబంధన కారణంగా ఐపీఎల్‌కు అర్హత సాధించలేకపోయాడు. ఇటీవల ముగిసిన ముస్తాక్ అలీ ట్రోఫీలో అర్జున్ ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. దీంతో ఐపీఎల్‌లో అరంగేట్రానికి మార్గం సుగమం అయింది.