రూ.3 వేల కోట్లతో నల్గొండ జిల్లాలో ఎత్తిపోతల పథకాలు... సీఎం కేసీఆర్ నిర్ణయం
- ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో కేసీఆర్ భేటీ
- సాగునీటి అంశాలపై చర్చ
- ఈ నెల 10న పలు పథకాలకు శంకుస్థాపన
- నెల్లికల్లు సహా పలు ప్రాజెక్టులకు శ్రీకారం
ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా సాగునీటి వ్యవస్థపై ఈ సమావేశంలో చర్చించారు.
వివిధ ప్రాజెక్టుల పరిధిలోని సాగుభూములను మినహాయించి, మిగిలిన ఆయకట్టుకు సాగు నీరు అందించడానికి రూ.3 వేల కోట్లతో ఎత్తిపోతల పథకాలు చేపడతామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. నెల్లికల్లుతో పాటు దాదాపు 9 ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడతామని చెప్పారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికి ఒకే చోట శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 10 మధ్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లులో శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.